శ్రీశైలంలో ఆలయం వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి

V6 Velugu Posted on Sep 19, 2021

శ్రీశైలం: భూ కైలాస క్షేత్రం శ్రీశైల మల్లన్న దర్శనానికి వచ్చిన భక్తుడు.. దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు. ఆదివారం ఉదయం జరిగిందీ ఘటన. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లి గ్రామానికి చెందిన అశోక్ వల్లిక అనే భక్తుడు శ్రీశైల మల్లన్న దర్శనం కోసం వచ్చాడు. ఉదయమే దర్శనం చేసుకుని ఆలయం బయటకు వచ్చిన వెంటనే గుండెపోటు రావడంతో కుప్పకూలి చనిపోయాడు. 
 

Tagged mahaboobnagar district, srisailam, Srisailam Temple, , ap updates, devotee dies of heart attack, Ashok.V, Jadcherla mandal, peddapalli village, devotee dies at temple

Latest Videos

Subscribe Now

More News