భద్రాచలం సీతారామచంద్రస్వామి గోశాలకు విరాళం

భద్రాచలం సీతారామచంద్రస్వామి గోశాలకు విరాళం

భద్రాచలం, వెలుగు:  భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో గోశాల కోసం హైదరాబాద్​కు చెందిన అల్లు వెంకట ఫణికిరణ్​ అనే భక్తుడు మంగళవారం విరాళం ఇచ్చారు. ఈవో దామోదర్​రావు చేతుల మీదుగా రూ.1,01,116ను అందజేశారు. మిథిలాస్టేడియం వెనుక జరుగుతున్న ప్రసాద్​ స్కీం పనులను ఈవో తనిఖీ చేశారు. జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.