మేడారం జాతరలో తాగునీటికోసం భక్తుల కష్టాలు

మేడారం జాతరలో  తాగునీటికోసం భక్తుల కష్టాలు

భూపాలపల్లి అర్బన్, వెలుగు: మేడారంలో తాగునీటి కోసం భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. తల్లులు గద్దెల కు చేరకముందే లక్షలాది మంది మేడారం చేరుకోగా తాగునీటి కోసం తల్లడిల్లారు. ముఖ్యంగా చిలుకలగుట్ట పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరా లేకపోవడంతో వాగులు, వంకలను ఆశ్రయిస్తున్నారు. క్యాన్లతో కిలోమీటర్లు నడిచి వెళ్లి తెచ్చుకుంటున్నారు. భక్తుల తాకిడి మరింత పెరిగితే నీటి తిప్పలు ఎక్కువైతాయని, అధికారులు సమస్య పరిష్క రించాలని భక్తులు కోరుతున్నారు.