ఏపీలో మే31 వరకు ఆలయాల్లోకి భక్తులకు అనుమతి లేదు

ఏపీలో మే31 వరకు ఆలయాల్లోకి భక్తులకు అనుమతి లేదు

కేంద్రం ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లోనూ నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని ఆ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.  అంతేకాదు మే 31 వరకు రాష్ట్రంలోని ఏ ఆలయంలోనూ భక్తులకు ప్రవేశం లేదని… అన్ని ఆలయాలకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేశారు. లాక్ డౌన్ ప్రారంభం నుంచి తాము ఇదే విధానం పాటిస్తున్నామని, ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నామని తెలిపారు. అయితే ఆర్జిత సేవల కోసం ఆన్ లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని…దీనికి సంబంధించి భక్తులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి చెప్పారు. అన్ని దేవాలయాల్లో నిత్య కైంకర్యాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు వెల్లంపల్లి.