మహాగణపతికి జన నీరాజనం.. సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు

మహాగణపతికి జన నీరాజనం.. సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు
  • సెలవు రోజు కావడంతో పోటెత్తిన భక్తులు    
  • నిమజ్జనాలతో సందడిగా ట్యాంక్​బండ్​ పరిసరాలు

హైదరాబాద్ సిటీ, వెలుగు :  ట్యాంక్ బండ్, ఖైరతాబాద్​పరిసరాలు ఆదివారం సందడిగా మారాయి. సెలవురోజు కావడంతో​ ఖైరతాబాద్ మహా గణపతి దర్శనానికి భక్తులు పోటెత్తగా, ఐదో రోజు గణేశ్​ నిమజ్జనాలు హుస్సేన్ సాగర్​లో జోరుగా సాగాయి. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా గంటల తరబడి భక్తులు క్యూలైన్లలో నిలబడి శ్రీవిశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకున్నారు. 

ఆదివారం ఒక్కరోజే 4 లక్షలకుపైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్టు  ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి స్వామివారిని దర్శించుకొని, హారతి ఇచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ బస్సు సర్వీసులు అర్ధరాత్రి వరకు నడిచాయి.