మేడారానికి పొటెత్తిన భక్తులు.. గట్టమ్మ ఆలయం దగ్గర బారులు తీరిన వాహనాలు

మేడారానికి పొటెత్తిన భక్తులు.. గట్టమ్మ ఆలయం దగ్గర బారులు తీరిన వాహనాలు

హైదరాబాద్: మేడారం మహా జాతరకు భక్తులు పొటెత్తారు. పండుగ సెలవుల నేపథ్యంలో వన దేవతలను దర్శించుకునేందుకు భారీగా తరలి వెళ్తున్నారు. శనివారం (జనవరి 17) ములుగు పట్టణంలోని గట్టమ్మ గుడి దగ్గర భక్తుల రద్దీ నెలకొంది. మేడారం జాతరకు వెళ్లే ముందు గట్టమ్మ తల్లిని దర్శించుకోవడం సెంటిమెంట్ అన్న విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా శనివారం (జనవరి 17) ఉదయం నుండే గట్టమ్మ తల్లి ఆలయం దగ్గర భక్తుల కోలాహలం నెలకొంది. గట్టమ్మ గుడి వద్ద వాహనాలు బారులు తీరాయి. గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాత భక్తులు మేడారం వెళ్తున్నారు. సమ్మక సారలమ్మల గద్దెల ప్రాంగణం కూడా భక్తులతో కిక్కిరిసిపోయింది. వనదేవతలకు భక్తులు మొక్కలు చెల్లించుకుంటున్నారు. 

2026, జనవరి 28 నుంచి నాలుగు రోజుల పాటు మేడారం మహా జాతర జరగనున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఇప్పటికే జాతరకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వన దేవతలను దర్శించుకునేందుకు దేశ నలుమూలల భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. జాతర సమయంలో రద్దీ దృష్ట్యా కొందరు భక్తులు ముందుగానే మేడారం వెళ్తున్నారు.