- స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు
శివసత్తుల పూనకాలు., ఒగ్గుడోలు దెబ్బలు.. శరణు శరణు మల్లన్నా అంటూ భక్తుల శరణు ఘోషతో బండారి మల్లన్న క్షేత్రం మార్మోగింది. హనుమకొండ జిల్లా ఐనవోలులో గొల్ల కేతమ్మ, బలిజ మేడాలమ్మ సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఉదయం నుంచే స్వామి వారిని దర్శించుకుని పట్నాలు వేసి, ఎల్లమ్మకు బోనాలు సమర్పించారు. కాగా, దేవాదాయ శాఖ మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాగరాజు, మేడ్చల్, మల్కాజ్గిరి ఎమ్మెల్యేలు మాల్లారెడ్డి, రాజశేఖర్రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ బండాప్రకాశ్ కుటుంబ సమేతంగా వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. - వర్ధన్నపేట (ఐనవోలు), వెలుగు
