భద్రాచలం,వెలుగు : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి గురువారం సికింద్రాబాద్ సీతారాంనగర్ గ్రామానికి చెందిన భక్తులు ఆదిత్య రూ.30లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను ఈవో దామోదర్‌రావు చేతులు మీదుగా అందజేశారు. కెంపులు, పచ్చల లాకెట్లతో కూడిన మూడు బంగారు గొలుసులను స్వామికి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకంగా పూజలు చేశారు.

