మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

మహాగణపతి దర్శనానికి క్యూ కట్టిన భక్తులు

హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శ్రీ దశ మహా విద్యా గణపతికి భారీ చేనేత జంధ్యం, కండువా సమర్పించారు. 63 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మహాగణపతిని దర్శించుకోడానికి భక్తులు క్యూకట్టారు. మహాగణపతి దగ్గర వైభవంగా పూజలు, హోమం జరుగుతున్నాయి. ఈ ఒక్క రోజే లక్ష మంది భక్తులు దర్శించుకునే అవకాశం ఉంది. 11 గంటల తర్వాత గవర్నర్ తమిళిసై ప్రత్యేక పూజలు చేయనున్నారు. 

నవరాత్రుల సందర్భంగా ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ఖైరతాబాద్, శాదన్ కాలేజ్, నిరంకారి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, మింట్ కంపౌండ్, నెక్లెస్ రోటరీ ల దగ్గర ట్రాఫిక్ డైవర్ట్ చేయనున్నారు ట్రాఫిక్ పోలీసులు.