
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాల కోలాహలం కనిపిస్తోంది. ఉదయం నుంచే హనుమాన్ స్వాములు, మాలధారులు కొండగట్టుకు చేరుకుని.. ఆలయ ప్రాంగణంలో దీక్షల్ని విరమిస్తున్నారు.
ఎల్లుండి బుధవారం జరిగే జయంతి వేడుకలకు ఆలయాన్ని ముస్తాబు చేసారు అధికారులు. మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు …3 లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
భక్తులు స్నానాలు చేసేందుకు కొత్త కోనేరును నీటితో నింపిన అధికారులు.. ఎండాకాలం కావడంతో తాగునీటి వసతి , చలివేంద్రాలు ఏర్పాటు చేశారు.