
ప్రతి వ్యక్తి జీవితంలో.. ప్రతి విషయంలో కూడావిజయం సాధించాలని కోరుకుంటాడు. కాని ఆదిశగా చేయాల్సినవి మాత్రం చేయడు. చేపట్టిన పనులన్నింటిలో విజయం కావాలంటే.. నిగ్రహంతో ఉండాలి. అప్పుడే మనిషి అనుకున్నవి అన్నీ సాధిస్తాడు.
చూసిందల్లా కావాలనుకోవడం.... అవసరం లేకున్నా వినాలనుకోవడం...నాలుక రుచుల వెంట... మనసు కోరికల వెంట పరుగులు తీయడం.. ఇలా ఇంద్రియా లు నిగ్రహం కోల్పోతే మనిషి పాతాళంలోకి పడిపోతాడు. ఇంద్రియ నిగ్రహంతో ఎందరో మహాత్ములయ్యారు.
దేవతలకు, రాక్షసుల కు మధ్య యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో తమకు సాయం చేయాలని దేవతలు అర్జునుడిని స్వర్గానికి పిలుస్తారు. తన యుద్ధ నైపుణ్యంతో అర్జునుడు దేవతలకు విజయం అందిస్తాడు. అర్జునుడి పరాక్రమానికి దేవలోక సౌందర్యరాశి ఊర్వశి ఆకర్షితురా లు అవుతుంది. దీనురాలిని... నాకు కూడా సాయం చేయండి అర్జునా.. అని అర్థిస్తుంది.
నీ ఆపద ఏమిటి... అని అర్జునుడు ఊర్వశిని అడుగుతాడు. దానికి నాకు నీలాంటి పుత్రుడు కావాలి. ప్రసాదించు అని కోరుతుంది ఊర్వశి. అర్జునుడు ఆమె మాటలోని మర్మా న్ని గుర్తిస్తాడు. పుత్రుడి కోసం నవమాసాల నిరీక్షణ ఎందుకు? ఈ రోజు నుంచి నేను నీకు పుత్రుడినే!' అంటూ చేతులు జోడించి ఆమెకు సమస్కరిస్తాడు. అర్జునుడి ఇంద్రియ నిగ్రహానికి ఊర్వశి ఆశ్చర్యపోతుంది. ఆ నిగ్ర హమే అతడిని అజేయుణ్ణి చేసింది