
మనస్సు పెట్టి చేస్తే ఏదైనా సాధించవచ్చని చెబుతుంటారు. అందుకే పూజ చేసినా.. చదివినా.. ఉద్యోగం కూడా మనసు పెట్టే చేయాలి.మనం చేసే ప్రతి పనికి మన మనస్సే హద్దుగా పని చేస్తుంది. నీవు చేస్తున్న రంగంలో సాధించిన.. సాధించకపోయినా.. ఆధ్యాత్మకంగా యోగిగా మారినా.. భోగిగా మారినా నిర్ణయించేది మనసేనని రమణ మహర్షి చెప్పారు.
గురువు-శిష్యుడు.... చీకటి-వెలుగు..... పని–భ్రమ..... ఆకారం- నిరాకారం.... యోగి- భోగి.. ఇలా ప్రతిదానిలో బ్రహ్మని చూసేవాడే బ్రాహ్మణుడని కదా ఉపనిషత్తు చెస్తోంది. సుప్రీం కాన్షియసటట్ ని తెలుసుకోవడానికి.. ఆకాశం కూడా హద్దు కాదు కానీ.... మన మనసు మాత్రం హద్దే.. ! అదే హద్దులు గీసి.. అంతకు మించి ముందుకు పోనివ్వకుండా ఆపుతుంటుంది! బ్రహ్మం చేరుకోవడానికి చాలా దారులు ఉన్నాయి. ఏ దారిలో నడిచినా చివరికి చేరేది మాత్రం ఒకే చోటుకి!
భగవంతుడి ప్రేమను మనసు ఆహ్వానించినప్పు డు.. ఇంద్రియాలు మనసులో విలీనమవుతాయి. ....బుద్ధి మేల్కొంటుంది... బ్రహ్మం అనే సముద్రంలో ప్రాణం వికసిస్తుంది. అప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణానికి అనేక దారులు ఉంటాయి. అన్నింటిని విడిచిపె ట్టడం ఒక దారైతే... భక్తి యోగం.. కర్మయోగం... రాజయోగం ... అనేవి ఇతర మార్గాలు. ఇవన్నీ ఒకే సముద్రానికి దారి తీసే నదీప్రవాహాల్లాంటివన్న మాట. తీసుకోవడం నుంచి బానిసత్వం వస్తుంది. అలాగే..త్యజించడం నుంచి విముక్తి లభిస్తుంది.
ఏ దారిలో..ప్రేమతో భగవంతుని గురించి ఆలోచించినప్పు దు, తోటి మనుషుల పట్ల, ప్రకృతిపట్ల కరుణతో, ప్రేమతో చూసినప్పుడు మనం భక్తి యోగులుగా మారుతాం. తన స్వార్ధం ఆలోచించకుండా నిత్యం..ఇతరులకు సాయం చేయడానికి నిలబ డినప్పుడు మనం కర్మయోగులుగా మారుతాం. ధ్యానం, యోగాను ప్రాక్టీస్ చేసినప్పుడు రాజ యోగులుగా మారుతాం. సత్యాన్ని, జీవిత పర మార్గాన్ని అన్వేషించుకుంటూ ముందుకు సాగు తున్నప్పుడు జ్ఞాన యోగులమవుతాం సత్యాన్ని కనుక్కోవడంలో.. సెల్ఫ్ ఎంక్వైరీ అన్నింటికంటే ఉత్తమమైన మార్గం అని రమణ మహర్షి అంటారు.
అన్నింటికీ మనసే..పని చేసేది.... అనుభవించేది ఈ రెండూ మనసుకు సంబంధించినవే. మనసు నుంచి పుట్టిన ఆలోచనే పనికి కారణ మవుతుంది. అది మంచి అయినా... చెడయినా! మనసు స్వచ్ఛంగా ఉన్నంతవరకు...పనిలో ఏ చెడూ కలవదు. బ్రహ్మాన్ని చేరుకునే అన్ని దారులు ఒకదానితో మరొకటి సంబంధం కలిగి ఉన్నాయి. పరమాత్మలో కలిసిపోవడం వాటన్నింటి లక్ష్యం. పరమాత్మను చేరుకోవడానికి మనం నడిచే దారిలో ఆకాశం కూడా హద్దు కాదు. కానీ మనసే కచ్చితంగా హద్దులా గిరి గీస్తుంది!