‘సుస్వాగతం’ లాంటి చిత్రాలతో హీరోయిన్‌గా ఆకట్టుకున్న దేవయాని.. రీఎంట్రీలోనూ మదర్ క్యారెక్టర్స్‌తో ఇంప్రెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కూతురు ఇనియా హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. అదికూడా తెలుగు సూపర్ హిట్ మూవీ రీమేక్‌తో. ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి లీడ్ రోల్స్‌లో రామ్ జగదీష్ డైరెక్షన్‌లో హీరో నాని నిర్మించిన ‘కోర్ట్’ చిత్రం తెలుగులో ఎంతగా మెప్పించిందో తెలిసిందే. ఇప్పుడీ సినిమా ‘రంజన్ ది అడ్వకేట్’ టైటిల్‌తో తమిళంలో రీమేక్ అవుతోంది.
తెలుగులో ప్రియదర్శి పోషించిన పాత్రను అక్కడ ప్రశాంత్ పోషిస్తుండగా ఆయన తండ్రి త్యాగరాజన్ దర్శకనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ శ్రీదేవి పోషించిన జాబిలి పాత్రను దేవయాని కూతురు ఇనియా పోషించబోతోంది. సోమవారం జరిగిన ఈ మూవీ ఓపెనింగ్‌కు తల్లితో కలిసి ఆమె హాజరైంది. నిర్మాత కథిరేసన్ కొడుకు హరి ఇనియాకు జంటగా నటిస్తున్నాడు.
జీవీ ప్రకాష్ కుమార్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. పాతికేళ్ల క్రితం ప్రశాంత్‌కు జంటగా ‘అప్పు’ (తెలుగులో ‘మహారాణి’) చిత్రంలో తాను నటించగా, ఇప్పుడు తన కూతురు ప్రశాంత్ బ్యానర్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోందని దేవయాని సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది.
