అగ్ని  ప్రమాదాలపై..అలర్ట్​ గా ఉండాలి : డీజీఎఫ్ఎస్ ​నాగిరెడ్డి

అగ్ని  ప్రమాదాలపై..అలర్ట్​ గా ఉండాలి : డీజీఎఫ్ఎస్ ​నాగిరెడ్డి

మాదాపూర్, వెలుగు:  ఎండాకాలంలో జరిగే అగ్ని  ప్రమాదాలపై అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాష్ర్ట ఫైర్ సర్వీస్​ డైరెక్టర్​(డీజీఎఫ్ఎస్) జనరల్​ వై. నాగిరెడ్డి సూచించారు.  సోమవారం స్టేట్​ డిజాస్టర్​ రెస్పాన్స్​ అండ్ ​ఫైర్ ​సర్వీస్​పై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు.

రాబోయే రోజుల్లో సంభవించే అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఎలాంటి చర్యలు  చేపట్టాలనే అంశాలపై జిల్లా ఫైర్ ​అధికారుల తో చర్చించారు. 15 రోజులుగా బేసిక్​ ఫ్లడ్​రెస్య్కూ, రోప్​ రెస్క్యూలపై ట్రైనింగ్ ​తీసుకుంటున్న 72 మంది సిబ్బంది శిక్షణ పూర్తి కావడంతో వారిని అభినందించారు. వీరి సేవలను జిల్లాల్లో ఫైర్​ అధికారులు ఉపయోగించుకోవాలని సూచించారు.