డీజీపీగా సీవీ ఆనంద్.. చూసి మురిసిపోయిన తల్లి

డీజీపీగా సీవీ ఆనంద్.. చూసి మురిసిపోయిన తల్లి

హైదరాబాద్, వెలుగు: కొడుకును డీజీపీగా చూడాలనుకున్న తల్లి కోరిక తీరింది. వృద్ధాప్యంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నప్పటికీ, డీజీపీ యూనిఫాంలో తన ముందు నిల్చున్న కుమారుడు సీవీ ఆనంద్‌‌ను చూసి ఆ తల్లి ఆనందంతో మురిసిపోయింది. కన్నప్రేమతో మనసారా ఆశీర్వదించింది. తన తల్లి ఆశీస్సులను డీజీపీ సీవీ ఆనంద్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.

గత నవంబర్ నుంచి జనవరి వరకు తన తల్లి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడ్డారని, ప్రస్తుతం ఆరోగ్యం కొంత మెరుగుపడినప్పటికీ ఆమె మంచానికే పరిమితమయ్యారని తెలిపారు. తాను రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టడం చూడాలన్న ఆమె ఆకాంక్షే, కష్టకాలంలోను ఆమె ప్రాణపాయం నుంచి కోలుకునేలా చేసిందని చెప్పారు. తాను డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, యూనిఫాంలో తల్లి ముందు నిలబడగా ఆమె ఆనందానికి అవధులు లేవని డీజీపీ సీవీ ఆనంద్ ఎమోషనల్ అయ్యారు.