సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు..హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తం: డీజీపీ జితేందర్

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు..హిస్టరీ షీట్ ఓపెన్ చేస్తం: డీజీపీ జితేందర్

బషీర్​బాగ్, వెలుగు: సైబర్ నేరగాళ్లతో పాటు సోషల్ మీడియాలో పదేపదే అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై హిస్టరీ షీట్ ఓపెన్ చేయాలని రాష్ట్ర డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. సోషల్ మీడియాను ఉపయోగించి ఆర్థిక నేరాలు చేస్తున్న వారిపై దృష్టి పెట్టాలని సైబర్ క్రైమ్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీ చేశారు. 

సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రకటనలు, తప్పుడు వ్యాఖ్యానాలు చేసే వారిపై దృష్టి సారించాలన్నారు. పదేపదే నేరాలు చేస్తున్న వారిని గుర్తించి హిస్టరీ షీట్ ఓపెన్ చేయడం ద్వారా ఆర్థిక నేరాలతో పాటు, అనుచిత పోస్టులు చేస్తున్న వారిని నియంత్రించే అవకాశం ఉంటుందన్నారు.