నిరుపేద బాలికలకు చేయూత

నిరుపేద బాలికలకు చేయూత
  •  హైటెక్స్ లో గోల్స్ ఫర్ గాల్స్ లీడర్ షిప్ సదస్సు
  • ప్రారంభించిన డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: గోల్స్ ఫర్ గాల్స్ ప్రోగ్రాం నిరుపేద బాలికలకు చేయూతనిస్తోందని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ సింక్రోనీ (NYSE SYF) ఐదు రోజుల పాటు హైటెక్స్ లో  నిర్వహించే సదస్సును ఆయన సోమవారం ప్రారంభించారు. ఇక్కడ నేర్చుకునే అంశాలను బాలికలు తమతో పాటు తమ కమ్యూనిటీల్లో మార్పుకు కృషిచేయాలన్నారు. కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల బాలికలను రాష్ట్ర పోలీస్ శాఖ చేరుకోవడంతో పాటు వారి అభ్యున్నతికి సహకారం అందిస్తుందన్నారు. సాంస్కృతిక, సామాజిక-, ఆర్థిక అవరోధాలు అధిగమించి సాధికారతకు దోహదపడుతుందని సింక్రోనీ బిజినెస్ లీడర్ ఎస్పీవీ ఆండీ పొన్నేరీ అన్నారు. ఈ సంవత్సరం 15మందికి పైగా సింక్రోనీ వలంటీర్లతో పాటు గోల్స్ ఫర్ గాల్స్ నుంచి ఐదుగురు ట్రైనర్లు, హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, వికారాబాద్ ప్రాంతాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలు, విభిన్నమైన నేపథ్యాలు కలిగిన 40 మంది బాలికలతో కలిసి తాము పనిచేయనున్నట్లు తెలిపారు. సింక్రోనీ ట్రైనర్లు, స్టూడెంట్స్, సింక్రోనీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

DGP Mahender Reddy launched Goals for Girls Leadership Seminar