
రాష్ట్రంలో లాక్ డౌన్ పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని కోర్టుకు తెలిపారు. ఔషధాల బ్లాక్ మార్కెట్ పై 160 కేసులు నమోదు చేశామన్నారు. ఏప్రిల్ 1 నుంచి జూన్ 7 వరకు 8.79 లక్షల కేసులు నమోదు చేశామని హైకోర్టుకు డీజీపీ నివేదిక సమర్పించారు. మాస్కులు ధరించని వారిపై 4.56 లక్షల కేసులు, రూ.37.94 కోట్ల జరిమానా విధించామని తెలిపారు. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు..లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపారు.