
హైదరాబాద్, వెలుగు: ఆపదలో పోలీస్ స్టేషన్‌కి వచ్చేవారికి మెరుగైన సేవలు అందించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. డీజీపీ కార్యాలయంలో మంగళవారం అడిషనల్ డీజీలు జితేందర్, గోవింద్ సింగ్, రాజీవ్ రతన్, స్వాతిలక్రా, నాగిరెడ్డి తదితరులతో కలిసి సిబ్బందికి పురస్కారాలు అందించారు. పోలీస్‌స్టేషన్ 17 ఫంక్షనల్ వర్టికల్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 256 మంది పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. పీఎస్‌ల్లో రిసెప్షన్ నుంచి కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ వరకు బాధ్యతాయుతంగా పనిచేయాలని డీపీజీ సూచించారు. అందరి సేవలు గుర్తిస్తామని అన్నారు. పీఎస్‌ల వారిగా నేరాల నియంత్రణ, ఇన్వెస్టిగేషన్, కేసుల దర్యాప్తు, సమన్లు, వారెంట్స్‌తో పాటు సరైన సాక్ష్యాధారాలతో నేరస్తులకు శిక్ష పడేలా పనిచేసిన వారిని పరిగణలోకి తీసుకుంటామని అన్నారు. ఫంక్షనల్ వర్టికల్స్ ప్రాతిపదికపైనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే మెడల్స్‌కు పేర్లను ప్రతిపాదిస్తామని స్పష్టం చేశారు. ఈ విధానంతో పోలీసుల పని సామర్ధ్యం పెరగడంతో పాటు మెరుగైన పోలీసింగ్ అందుతుందని పేర్కొన్నారు.