
హైదరాబాద్: సింగరేణికాలనీ హత్యాచార నిందితుడు రాజు సూసైడ్ కేసులో ఎలాంటి అనుమానాలు లేవని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ‘కొణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు.. ఘటన జరిగిన వెంటనే స్టేషన్ ఘన్పూర్ రైల్వే స్టేషన్ మాస్టర్‌కి ఇన్ఫార్మ్ చేశారు. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా రైల్వే ఇన్ఫర్మేషన్ సెంటర్లో ఇన్సిడెంట్ గురించి చెప్పారు. పొలాల్లో పని చేసే రైతులు కూడా ఘటనను ప్రత్యక్షంగా చూశారు. రైల్వే గ్యాంగ్మాన్కి రాజు అనుమానంగా కనిపించాడు. రైల్వే గ్యాంగ్‌మాన్ రాజు డెడ్ బాడీని చూసి చెప్పాడు. ఘటనను చూసిన ఏడుగురు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు’ అని డీజీపీ తెలిపారు.