
- పోలీసు ఆఫీసర్స్ న్యూ ఇయర్ వేడుకల్లో డీజీపీ రవిగుప్తా
హైదరాబాద్, వెలుగు : డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణ, మహిళల రక్షణపై ఎక్కువగా దృషి పెట్టాలని డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు. డ్యూటీలో నిబద్ధత, సమష్టితో పని చేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని సూచించారు. రాష్ట్ర పోలీసులు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారని.. అదే స్ఫూర్తితో ఈ ఏడాది మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. హైదరాబాద్‌లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్‌లో సోమవారం న్యూ ఇయర్ వేడుకలు జరిగాయి. ఇందులో హోం శాఖ సెక్రటరీ జితేందర్, రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అంజనీకుమార్
ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్ రెడ్డిలతో కలిసి డీజీపీ కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గతేడాది బోనాలు, గణేశ్, దసరా ఉత్సవాలు, ఎలక్షన్స్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో కూడా అదే విధంగా పని చేయాలని సూచించారు. ప్రజా భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, గ్రామీణ స్థాయిలో ప్రజలతో సన్నిహిత సంబంధాలపై ప్రధాన దృష్టి పెట్టాలని స్పష్టంచేశారు.