'జింతాక్'.. మాస్ సాంగ్ వచ్చేసింది

'జింతాక్'.. మాస్ సాంగ్ వచ్చేసింది

మాస్‌ మహారాజా ర‌వితేజ హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వ‌రుస‌ సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం "ధమాకా". త్రినాథ్ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీ నుండి లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. 

ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ 'జింతాక్' లిరికల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. ఈ సాంగ్ లో రవితేజ, శ్రీలీలాను మాస్ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఈ పాటకిభీమ్స్ చాలా అద్భుతమైన సంగీతం అందించాడు. ఇక ‘డబుల్ ఇంపాక్ట్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ధమాకా మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందించాడు.