'ధమాకా' రొమాంటిక్ గ్లింప్స్ రిలీజ్

'ధమాకా' రొమాంటిక్ గ్లింప్స్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా'. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్ పనులు పూర్తి కావస్తుండగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ నుండి ఒక రొమాంటిక్ గ్లింప్స్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో రవితేజ ఓ పెళ్లిలో హీరోయిన్ శ్రీలీలకు రొమాంటిక్ గా సిగ్నల్స్ ఇస్తూ ఆమెను కట్టి పడేశాడు. చాటుగా కలిసేందుకు ఇష్టం లేకపోయినా అతడి ప్రయత్నానికి చివరికి కరిగిపోయి ఓకే అన్నట్టుగా సైగ చేస్తుంది.

ఇందులో శ్రీలీల సాంప్రదాయ చీరలో అందంగా కనిపిస్తుండగా.. రవితేజ యూత్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. రొమాంటిక్ గ్లింప్స్ యూత్ ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోతో అదిరిపోయే రొమాన్స్ తో రవితేజ మరోసారి రక్తి కట్టించబోతున్నాడని అర్థమవుతోంది. ప్రస్తుతం ధమాకా టీజర్ గ్లిమ్స్ వైరల్ గా దూసుకెళుతోంది.  పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.