బషీర్‌బాగ్, వెలుగు: ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి 31 వరకు కడ్తల్ మహేశ్వర పిరమిడ్ వద్ద పిరమిడ్ స్పిరిట్చ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పత్రీజీ ధ్యాన మహాయాగం–4 నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
పత్రీజీ శక్తిస్థల్ కడ్తల్‌లో ఈ ధ్యాన దినోత్సవం జరుగుతుందని చెప్పారు. ఈ నెల 21న రాములు మహారాజ్, డాక్టర్ సుమన్ కొల్లిపర(కెనడా), 22న కృష్ణ చాముండేశ్వరి మహర్షి, 23న 111 ఏళ్ల బాబా సంత్ సదానందగిరి మహారాజ్ వేడుకలకు హాజరవుతారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజన, వసతి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ట్రస్టీలు మధు మోహన్, నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.
