డిసెంబరు 17 నుంచి ధనుర్మాసం ప్రారంభం

డిసెంబరు 17 నుంచి ధనుర్మాసం ప్రారంభం

తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.  తిరుమలలో ధనుర్మాస ఉత్సవాలు డిసెంబర్​ 17న తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తానికి  గంటన్నర ముందుగా స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. 

ధనుర్మాసాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో డిసెంబర్ 17వ తేదీ నుంచి తిరుప్పావైని నివేదిస్తారు. శ్రీవారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావైని నివేదిస్తారు. ధనుర్మాసం డిసెంబర్ 17నుంచి ప్రారంభం కానుంది. శ్రీవారికి తిరుప్పావై సేవ అదే రోజున ప్రారంభిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది. పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీ మహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. 

ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం...

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు  సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం...

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో  భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.