Dhanush,Mrunal: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ధ‌నుష్‌, మృణాల్ డేటింగ్ రూమర్స్.. వీడియోలు వైరల్

Dhanush,Mrunal: సోషల్ మీడియాను ఊపేస్తోన్న ధ‌నుష్‌, మృణాల్ డేటింగ్ రూమర్స్.. వీడియోలు వైరల్

సినిమా సెలబ్రటీల సమాచారాలంటే ఎప్పుడు ప్రత్యేకమే. వీళ్ళేం చేసిన అది సోషల్ మీడియా ట్రెండింగ్ వార్తలే. వాళ్లు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకున్న దగ్గరి నుండి.. చివరికి విడిపోయే వార్తల వరకు అన్నీ హాట్ టాపిక్సే! అవేంత ట్రెండింగ్ అంటే.. ప్రపంచం తలక్రిందులైన, ఇలాంటి వార్తలు మాత్రం స్టాండింగ్ పోజిషన్ లోనే ఉంటాయి. ఇపుడీ ఈ ముచ్చటంత ఎందుకంటారా? అవును.. ఇపుడీ ఇలాంటి వార్తే.. సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల కాలంలో ఓ స్టార్ సెలబ్రెటీ జంట కలిసి చేస్తున్న పార్టీలు, ప్రీమియర్ షోల ఈవెంట్లు.. రూమర్స్గా మారాయి. మరి ఆ జంట ఎవరనేది వివరాల్లోకి వెళితే.. 

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, బ్యూటీ మృణాల్ థాకూర్ మధ్య డేటింగ్ రూమర్స్ ఊపందుకున్నాయి. ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ జంట కలిసే దర్శనమిస్తుండటం అందుకు ఊతమైంది. వరుస పార్టీలతో, ప్రీమియర్లలో కనిపించడం నెటిజన్ల ఊహాగానాలకు తెరతీసింది. అంతేకాదు.. ఈ జంట ఏం చేసిన రూమర్స్ కొనసాగడం, నెటిజన్లు వారిపై ఓ కన్నేయడం రెట్టింపు అవుతూనే వస్తోంది. 

ధనుష్ & మృణాల్ మీటింగ్స్:

మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ మూవీ ప్రీమియర్కు అటెండ్ అయ్యారు ధనుష్. ఈ ఈవెంట్లో మృణాల్ స్వయంగా వెళ్లి ధనుష్ని స్టేజిపైకి ఆహ్వానించింది. అంతేకాకుండా వీరిద్దరూ ప్రైవేట్గా ఒకచోట మాట్లాడుకోవడం మరిన్ని పుకార్లకు దారీతీసింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

అలాగే, రీసెంట్గా ఆగస్టు 1న జరిగిన మృణాల్ బర్త్డే పార్టీలో కూడా ధనుష్ కనిపించి స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాడు. అంతకముందు ధనుష్ నటించిన బాలీవుడ్ మూవీ ‘తేరే ఇష్క్ మే’ర్యాప్ పార్టీకి కలిసి అటెండ్ అయ్యారు. అలాగే, కాజోల్ నటించిన హారర్ థ్రిల్లర్ ‘మా’మూవీ స్క్రీనింగ్కి కూడా వీళ్లు కలిసే రావడం హాట్ టాపిక్ అయింది.

ఈ వార్తలకు తోడుగా, లేటెస్ట్గా ధనుష్, మృణాల్కి సంబంధించి మరో వార్త వైరల్ అవుతుంది. ధనుష్ ఇద్దరు అక్కలు, డాక్టర్ కార్తీక కార్తీక్ మరియు విమల గీతలను ఇపుడు మృణాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతుంది. ఆసక్తికరంగా, వారిద్దరూ కూడా మృణాల్‌ను ఫాలో అవుతున్నారు. అయితే, ధనుష్, హీరోయిన్ మృణాల్తో ఉన్న ప్రేమను తన సిస్టర్స్తో షేర్ చేసుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇలా ఈ స్టార్ సెలబ్రెటీ జంట వరుస మీటింగ్స్.. డేటింగ్ రూమర్స్గా ఊపందుకున్నాయి. మరీ పుకార్లపై ఎవరు స్పందించకపోవడంతో పాటు ఖండించకపోవడం గమనార్హం! ఇకపోతే.. ధనుష్ సిస్టర్స్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్గా ఉంటారు. వారు తరుచుగా ఫ్యామిలీ రిలేషన్స్కి సంబంధించి వీడియోలు పంచుకుంటారు. 

ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు హీరోగా నటిస్తూనే, డైరెక్టర్గా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. మధ్యలో సినిమాలు సైతం నిర్మిస్తున్నారు. గతేడాది రాయన్, ఈ ఏడాది కుబేరా సినిమాలతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఇడ్లీ కడై, తేరే ఇష్క్ మే, అబ్దుల్ కలాం బయోపిక్తో పాటుగా మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. 

ఇక మృణాల్ సైతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో ఆడియన్స్కు దగ్గరైంది. ప్రస్తుతం మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ఆగస్టు 1న రిలీజై, థియేటర్లో రన్ అవుతుంది. ఇప్పుడీ బ్యూటీ చేతిలో అడవిశేష్ డెకాయిట్, హే జవానీ తో ఇష్క్ హోనా హై, తుమ్ హో తో, పూజ మేరీ జాన్, తెలుగులో మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో ఉన్నాయి.