కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఇటీవల వారణాసి నగరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 2013లో ఆయన కెరీర్ లో మైలురాయిగా నిలిచిన 'రాంఝణా' (Raanjhanaa) చిత్రం జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సినిమాలో కుందన్ పాత్రకు ఈ నగరమే బ్యాక్‌డ్రాప్‌గా నిలిచింది. ఈ పవిత్ర నగరం, పదేళ్ల క్రితం ధనుష్ పోషించిన 'కుందన్' పాత్రకు జీవం పోసింది. ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, వారణాసిలోని ఫోటోలను ధనుష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ధనుష్ 'ఫుల్ సర్కిల్' జర్నీ!
అయితే, ధనుష్ పర్యటన కంటే, ఈ పోస్ట్‌కు నటి మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్ ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఆమె చేసిన పోస్ట్ కు వారి మధ్య ఉన్న బంధానికి మరింత బలం చేకూర్చింది. ధనుష్ వారణాసిలో తన పర్యటన గురించి భావోద్వేగంతో కూడిన పోస్ట్‌ను పంచుకున్నారు. దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ (Raanjhanaa, Tere Ishk Mein చిత్రాల దర్శకుడు) కూడా ధనుష్‌తో పాటు ఈ పర్యటనలో ఉన్నారు.
ఇదంతా ఎక్కడ మొదలైందో ఆ జ్ఞాపకాల దారి గుండా నడుస్తున్నాను అని ధనుష్ చెప్పుకొచ్చారు.. కుందన్... దశాబ్దానికి పైగా గడిచినా నన్ను వదిలిపెట్టని పాత్ర. బనారస్ ఇరుకు సందుల్లో ఇప్పటికీ 'కుందన్' అనే పేరు ప్రతిధ్వనిస్తుంది. ప్రజలు నన్ను పిలిస్తే నేను తిరిగి నవ్వి చూస్తాను. అదే సందుల్లో నడుస్తూ, అదే ఇంటి ముందు కూర్చుని, అదే టీ షాపులో ఛాయ్ తాగుతూ, ఆ గంగా తీరాన నాకు కుందన్‌ను ఇచ్చిన మనిషితో నడవడం ఒక 'పూర్తి వృత్తం'లా అనిపిస్తోంది" అని ధనుష్ పోస్ట్ లో ప్రస్తావించారు. అంతేకాదు, ఈ పర్యటనతో 'రాంఝణా' నుండి తన తదుపరి చిత్రం 'తేరే ఇష్క్ మే' కి మారినట్లు ప్రకటించారు.'ఇక ఇప్పుడు శంకర్‌కు సమయం. 'తేరే ఇష్క్ మే'... ఈ రోజు నుంచి రిలీజ్ చేశారు. హర హర మహాదేవ్" అని ముగించారు.
మృణాల్ డేటింగ్ రూమర్ల వేళ..
ధనుష్ ఎమోషనల్ పోస్ట్‌కు మృణాల్ ఠాకూర్ స్పందించిన తీరు అభిమానుల దృష్టిని మళ్లింది. ఆమె కామెంట్ చేస్తూ, "@dhanushkraja సర్... వాట్ ఏ బ్యూటిఫుల్ జర్నీ! బ్లాక్‌బస్టర్!! కల్ట్!!! లెగసీ!!" అని ప్రశంసించారు. ధనుష్ కూడా హగ్స్, హార్ట్ ఎమోజీలతో బదులిచ్చారు. నిజానికి, వీరిద్దరి మధ్య పుకార్లు ఇప్పుడే మొదలు కాలేదు. గతంలో మృణాల్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' ప్రీమియర్‌లో వారు ఆలింగనం చేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఆ తర్వాత ధనుష్ నటిస్తున్న 'తేరే ఇష్క్ మే' ర్యాప్ పార్టీకి మృణాల్ హాజరు కావడం కూడా చర్చకు దారితీసింది. మృణాల్, ధనుష్ సోదరీమణులను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం వంటివి ఈ రూమర్లకు మరింత బలాన్నిచ్చాయి. ఈ నేపథ్యంలో.. లేటెస్ట్ గా ధనుష్ పాత జ్ఞాపకాల గురించి రాసిన పోస్ట్‌కు మృణాల్ 'బ్లాక్‌బస్టర్, లెగసీ' వంటి పదాలతో అభినందించడం... ఇద్దరూ తమ బంధాన్ని ఇంకా గోప్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారేమోనని అభిమానులు అనుకుంటున్నారు.
'తేరే ఇష్క్ మే' విడుదల!
ధనుష్ , కృతి సనన్ జంటగా నటించిన 'తేరే ఇష్క్ మే' చిత్రం ఈ రోజు నవంబర్ 28, 2025 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భావోద్వేగ ప్రేమకథ, 'రాంఝణా' చిత్రానికి ఒక స్పిరిట్యువల్ సీక్వెల్ లా ఉందని, AR రెహమాన్ సంగీతం అద్భుతంగా ఉందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒకవైపు ధనుష్ తన కెరీర్ లో మరో ముఖ్యమైన సినిమా విడుదల ఆనందంలో ఉంటే, మరోవైపు మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్... వారిద్దరి వ్యక్తిగత జీవితంపై అభిమానుల ఆసక్తిని మరింత పెంచింది.
