డిసెంబర్ 2న వరల్డ్ వైడ్‌‌‌‌గా విడుదల

డిసెంబర్ 2న వరల్డ్ వైడ్‌‌‌‌గా విడుదల

గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న ధనుష్.. ఈ ఇయర్ ఇప్పటికే మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పుడు మరో మూవీతో రెడీ అవుతున్నాడు. డబ్బింగ్‌‌‌‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ధనుష్, ‘సార్‌‌‌‌‌‌‌‌’ సినిమాతో టాలీవుడ్‌‌‌‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ తెలుగు, తమిళ బైలింగ్వల్‌‌‌‌ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. నిన్న రిలీజ్‌‌‌‌ డేట్‌‌‌‌ని ప్రకటించారు.

డిసెంబర్ 2న వరల్డ్ వైడ్‌‌‌‌గా విడుదల చేయనున్నట్టు కన్‌‌‌‌ఫర్మ్ చేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను వదిలారు. మ్యాథ్స్ లెక్చెరర్ పాత్రలో సింపుల్‌‌‌‌గా కనిపిస్తున్న ధనుష్.. క్లాస్‌‌‌‌రూమ్‌‌‌‌లో స్టూడెంట్స్‌‌‌‌కి ఏదో చూపిస్తున్నాడు. వాళ్లు తల దించుకోవడాన్ని బట్టి చూస్తే దేనికో క్లాస్ పీకుతున్నాడనిపిస్తోంది. నిజానికి ఈ చిత్రాన్ని అక్టోబర్‌‌‌‌‌‌‌‌లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. పోస్ట్ ప్రొడక్షన్‌‌‌‌ ఆలస్యమవడంతో డిసెంబర్‌‌‌‌‌‌‌‌కి పోస్ట్‌‌‌‌పోన్ చేశారు. సాయికుమార్, తనికెళ్ల భ‌‌‌‌ర‌‌‌‌ణి, సముద్రఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ మూవీ తమిళంలో ‘వాతి’ పేరుతో  విడుదల కానుంది.