నేటితో ఏడాది పూర్తి చేసుకున్న ధరణి పోర్టల్

నేటితో ఏడాది పూర్తి చేసుకున్న ధరణి పోర్టల్

ధరణి పోర్టల్ విజయవంతంగా రేపటితో ఏడాది పూర్తి చేసుకోనుండటంతో పాటు..పారదర్శకంగా సేవలు అందించింది. సంవత్సర కాలంలో 10 లక్షలకుపైగా లావాదేవీలు నిర్వహించింది. ఫస్ట్ ఇయర్ లోనే ధరణి ప్రగతి సాధించడంతో సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ధరణిని విజయవంతంగా అమలు చేసినందుకు అధికారులను అభినందించారు. ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని సంతోషం వ్యక్తం చేశారు సీఎం.

భూ సంస్కరణలో భాగంగా దేశంలోనే మొదటి సారిగిగా ధరణి పోర్టల్‌ను తీసువుకుచ్చి రేపటి(శుక్రవారం)కి ఏడాది పూర్తికానుంది. గతేడాది అక్టోబర్ 29వ తేదీన సీఎం కేసీఆర్ ఈ ధరణి పోర్టల్‌ను ప్రారంభించగా.. ఈ పోర్టల్ విజయవంతంగా తన కార్యకలాపాలను పూర్తి చేసుకుంది.

రెవెన్యూ పరిపాలనలో సురక్షితమైన, అవాంతరాలు లేని, ట్యాంపర్ ప్రూఫ్, విచక్షణ లేని సేవలను అందించే వినూత్నమైన, అత్యాధునిక ఆన్‌లైన్ పోర్టల్ ఈ ధరణి. భూ సంబంధిత లావాదేవీలకు ధరణి వన్-స్టాప్ పరిష్కారాన్ని అందిస్తుంది. ధరణి ప్రారంభంతో రిజిస్ట్రేషన్ సేవలు ప్రజల ఇంటి దగ్గరకే చేరాయి. ధరణికి ముందు 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగేవి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో 574 తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి.

భూపరిపాలనలో ధరణి కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. మొదటి సంవత్సరంలోనే ధరణి సాధించిన ప్రగతి అంతా ఇంతా కాదు. ఈ ఏడాదిలో ధరణి వెబ్ పోర్టల్ 5.17 కోట్ల హిట్‌లను సాధించగా, ధరణి ద్వారా దాదాపు 10 లక్షల లావాదేవీలు పూర్తయ్యాయి.