ఇంకా.. ధరిచేర్చని ‘ధరణి’ : రైతులు ఆందోళన

ఇంకా.. ధరిచేర్చని ‘ధరణి’ :  రైతులు ఆందోళన

రంగారెడ్డి జిల్లా, వెలుగుపక్కాగా భూముల రికార్డుల రూపకల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ధరణి వెబ్​సైట్​ను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.  ఇందులో భాగంగా  రంగారెడ్డి జిల్లా  షాద్‌‌‌‌నగర్‌‌‌‌ డివిజన్‌‌‌‌లో పైలెట్‌‌‌‌ ప్రాజెక్టుగా ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ ప్రారంభించింది. అయితే ప్రారంభించిన పదిహేను రోజుల్లోనే సాంకేతిక సమస్య తలెత్తిందనే  నెపంతో పూర్తిగా నిలిపివేశారు. ఇప్పటి వరకు వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ మళ్లీ అందుబాటులోకి రాలేదంటూ సంబంధిత అధికారులు చెబుతున్న మాటలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఎన్నికల  సందర్భంగా హడావుడి చేసేందుకే పైలెట్​ ప్రాజెక్టును చేపట్టారన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.  షాద్‌‌‌‌నగర్‌‌‌‌లో ధరణి పైలెట్​ సక్సెస్‌‌‌‌ ఆధారంగా  మరికొన్ని  ప్రాంతాలకు విస్తరింప చేయాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రారంభంలోనే పైలెట్​ ప్రాజెక్టును సఫలీకృతం చేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలం అయ్యిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన ధరణిని చిత్తశుద్ధితో ప్రజలకు అందించేందుకు కార్యాచరణతో ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

జీరాక్స్‌‌‌‌లు తీసుకుంటున్నారు…

ధరణి వైబ్‌‌‌‌సైట్‌‌‌‌ సంబంధిత తహసీల్దార్‌‌‌‌లకు అనుసంధానం చేశారు. షాద్‌‌‌‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, ఫరూఖ్‌‌‌‌నగర్, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో ‘ధరణి’ వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ను ప్రారంభించారు. వైబ్‌‌‌‌సైట్ ప్రారంభించిన ఫలితం లేకుండా పోయింది. పౌరసేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్ధేశ్యంతో ప్రారంభించారు. సాంకేతిక సమస్యలను పరిష్కారించడంలో ధరణి వెబ్‌‌‌‌సైట్‌‌‌‌ టెక్నాలజి కాంట్రాక్టర్‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యవహారించడంతో పౌర సేవలు ప్రజలకు దూరమైయ్యాయి. ఏడాది కాలం ముగుస్తున్న ఇప్పటికి వీటిపై పురగతి లేదు.  నెల రోజులు గడుస్తున్నా నేటివరకు ఒక్కరోజు కూడా సక్రమంగా పనిచేసిన దాఖలాలు లేవు. ప్రభుత్వం జారీ చేసిన నూతన పాస్‌‌‌‌ పుస్తకాల్లో అనేక తప్పులు సంతరించుకున్నాయి. ఈ తప్పులను సరిచేసుకునేందుకు సంబంధిత అధికారుల చూట్టు తిరిగి పలితం కానరావడంలేదంటున్నారు.

అధికారులు మీ పాసుబుక్స్​  జిరాక్స్‌‌‌‌లు ఇవ్వండి సమస్యను పరిష్కారిస్తామని రైతులకు మాటాలు చెబుతున్నారు. కానీ జిరాక్స్‌‌‌‌ తీసుకొవడానికి అధికారులు పరిమితమైతున్నారు తప్పా పరిష్కారం దోరకడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాసు పుస్తకాల్లో వచ్చిన తప్పుల కారణంగా రైతులకు రైతుబంధు చెక్కులను సైతం ఇవ్వడం లేదు. నూతన పాస్‌‌‌‌పుస్తకాలు ఎప్పుడు ఇస్తారంటూ అన్నదాతలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పడం లేదని అంటున్నారు. పాత పట్టాదారు పాస్‌‌‌‌పుస్తకం, టైటిల్‌‌‌‌డీడ్, ఆర్‌‌‌‌ఓఆర్ పత్రాలు జిరాక్స్ తీసి అధికారులకు ఇచ్చి వెళ్తున్నామే తప్ప కొత్త పాస్‌‌‌‌పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిచేయడం లేన్నారు. కొత్త పట్టాదారు పాస్‌‌‌‌పుస్తకాల్లో వచ్చిన తప్పులను సరిచేసేందుకు రెవెన్యూ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేన్నారు.