ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. దొంగ ఓట్లు, దొంగ నోట్లు ,దొంగ పాస్ పోర్టుల్లో దిట్ట..

 ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే..  దొంగ ఓట్లు, దొంగ నోట్లు ,దొంగ పాస్ పోర్టుల్లో దిట్ట..

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల నమోదు జరుగుతోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసి అధికార పార్టీ  ఎమ్మెల్యే షకీల్ దొంగ ఓట్లు నమోదు చేయిస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల నమోదులో ఎమ్మెల్యే షకీల్ తో పాటు..ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బోధన్ ఎమ్మెల్యే షకీల్..మూడింటిలో దిట్ట అని చెప్పారు ఎంపీ ధర్మపురి అర్వింద్. దొంగనోట్లు, దొంగ ఓట్లు, దొంగ పాస్ పోర్టులు తయారు చేయడంలో షకీల్ పేరు సంపాదించారని చురకలటించారు. బోధన్ లోని నాలుగు బూత్ లలో వేల సంఖ్యలో బోగస్ ఓట్లను నమోదు చేయిస్తున్నారని ఆగ్రహం  వ్యక్తం చేశారు.  

Also Read :- బీజేపీకి యువతే బలం..మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి

బోధన్, నిజామాబాద్ మీ సేవ సెంటర్ల నుంచి బోగస్ ఓట్లను నమోదు చేయించారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. మరాఠీ గుర్తింపు కార్డులు ఉన్న వారికి బోధన్ లో ఓట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. బోగస్ ఓట్లతో పాటు మీ సేవ సెంటర్లపై దర్యాప్తు  జరపాలని..తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ ను కలిసి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై ఇప్పటికే  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఎంపీ అర్వింద్ వెల్లడించారు.