బీజేపీకి యువతే బలం..మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి

బీజేపీకి యువతే బలం..మోదీ నాయకత్వాన్ని బలపర్చాలి

దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రధాని మోదీ అహర్నిశలు కృషి చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. మోదీ ప్రధాని అయ్యాక దేశాన్ని ప్రపంచంలో అయిదో ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చారని..ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా మార్చేందుకు కష్ట పడుతున్నారని తెలిపారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రిలో వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా చెన్నూరు నియోజకవర్గ ఇంచార్జ్ అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో 100 మంది యువకులు బీజేపీలో చేరారు. వారందరికి పార్టీ కండువా కప్పిన వివేక్ వెంకటస్వామి..బీజేపీలోకి ఆహ్వానించారు. 

ప్రపంచ దేశాలతో స్నేహ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధాని మోదీ  జీ20 సదస్సును వినియోగించుకున్నారని వివేక్ వెంకటస్వామి తెలిపారు.  జీ 20 సదస్సుపై ప్రతిపక్షాలు అనవసర  ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. మోదీ నాయకత్వాన్ని మరింత బలపర్చాలని సూచించారు. బీజేపీకి యువతే అతి పెద్ద బలం అని అన్నారు.