
టీఆర్ఎస్ బెదిరింపు రాజకీయాలు చేస్తోందన్నారు ఎంపీ అర్వింద్. విద్యావంతులు ఓటు వేయరని.. టీఆర్ఎస్ కు భయం పట్టుకుందన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బీజేపీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అర్వింద్. కేసీఆర్ దగ్గర రాష్ట్ర మంత్రులు బానిసలయ్యారని విమర్శించారు. ఎన్నికల ప్రచారానికి.. కేటీఆర్ ఉస్మానియా యూనివర్శిటీకి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఓయూలో కేటీఆర్ ప్రచారం చేస్తే బీజేపీ ఓట్లు కూడా టీఆర్ఎస్ కే వేస్తామన్నారు. రాంచందర్ రావు గెలుపు తెలంగాణ సమాజానికి అవసరమన్నారు అర్వింద్.