
ధర్మపురి/జగిత్యాల రూరల్, వెలుగు: ధర్మపురి టౌన్ లో జరిగిన బంగారం చోరీ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ సోమవారం ధర్మపురి సర్కిల్ ఆఫీసు లో మీడియాకు వివరాలు వెల్లడించారు.
ధర్మపురి టౌన్ లోని వస్త్ర వ్యాపారి కొలేటి మల్లికార్జున్ ఇంట్లో జరిగిన చోరీపై ఫిర్యాదుతో ధర్మపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఇద్దరు మైనర్లను నిందితులను గుర్తించారు. వారి వద్ద రూ.22 లక్షలు విలువైన 22.71 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసు కుని జువెనైల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరిచినట్లు చెప్పారు.