- స్టూడెంట్లు ఆందోళన చెందొద్దన్న కేంద్రమంత్రి
- సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ
వాల్యుయేషన్‌కు సంబంధించి ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానంలో తప్పులు జరిగాయని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పరోక్షంగా అంగీకరించారు. ‘‘ఈ తేడాలకు నేనే బాధ్యత వహిస్తాను. ఈ సమస్యలపై తగిన చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్క విద్యార్థి సందేహానికి సమాధానం ఇవ్వకుండా వదిలిపెట్టం’’ అని మంత్రి స్పష్టంగా చెప్పారు.
ఓఎస్ఎం టెక్నాలజీని పర్యవేక్షించడానికి ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్ వంటి టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌ను రంగంలోకి దించినట్టు ఆయన తెలిపారు. 17 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 98 లక్షల ఆన్సర్షీట్ల కాపీలు భద్రంగా ఉన్నాయని, ప్రతి ఆన్సర్ బుక్‌లెట్‌లో దాదాపు 40 పేజీలుంటాయి కనుక మొత్తం 40 కోట్ల స్కాన్డ్ పేజీలు ఈసారి ఫస్ట్ టైమ్ డిజిటల్‌గా వాల్యుయేషన్ చేసినట్టు మంత్రి వివరించారు.
స్టూడెంట్లు, తల్లిదండ్రులు తమ ఆన్సర్ పేపర్లు చూడటానికి పోర్టల్ ఓపెన్ చేసినప్పుడు అది పదే పదే క్రాష్ అవడం, పేమెంట్ చేయడానికి ప్రయత్నిస్తే అది ఫెయిల్ అవడం, స్కాన్ చేసిన పేజీలు బ్లర్‌గా కనిపించిన విషయాలను ఒప్పుకున్నారు. ఓఎస్ఎం విధానం ప్రపంచంలో పలు ప్రముఖ విద్యాసంస్థలు ఇప్పటికే అనుసరిస్తున్నాయని, ఇది స్టూడెంట్ సెంట్రిక్‌గా రూపొందించిన ఒక ప్రోగ్రెసివ్ సిస్టమ్ అని చెప్పారు. స్టూడెంట్లు వారి మార్కులను ట్రాన్స్పరెంట్గా తెలుసుకోవడానికి ఈ విధానం దోహదం చేస్తుందన్నారు.
రాహుల్ కామెంట్లపై స్పందన
రాసిన ఆన్సర్స్‌ను దిద్దలేదని, మార్కులు తప్పుగా వేశారని పలు చోట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 4 లక్షల మందికి పైగా విద్యార్థులు తమ ఆన్సర్షీట్ల స్కాన్ కాపీలు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే 12వ తరగతికి చెందిన పేపర్ల కోసం 11.31 లక్షల రిక్వెస్టులుగా రాగా.. 8.98 లక్షల కాపీలు అందించినట్టు సమాచారం.
ఓఎస్ఎం కాంట్రాక్టు పొందిన కంపెనీ గతంలో గ్లోబరీనా పేరుతో ఉండేదన్నారు. ఆ కంపెనీ 2019, 2023లో చేసిన స్కామ్‌లతో తెలంగాణాలో పలువురు స్టూడెంట్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
అలాంటి కంపెనీకి ఈ కాంట్రాక్టు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రాజకీయ విమర్శలు చేస్తున్నారని.. వాటి వల్ల తప్పును కప్పిపుచ్చుకోలేరని అన్నారు. అయినప్పటికీ 18 లక్షల మంది విద్యార్థులు తరఫున తాను ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. రాహుల్ చేసిన ఈ కామెంట్లు, ఓఎస్ఎంపై నెలకొన్న ఆందోళనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.
