ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాం.. జీవో నం. 46ను రద్దు చేయాండి..

ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాం.. జీవో నం. 46ను రద్దు చేయాండి..

ప్రభుత్వాన్ని చేతులెత్తి మొక్కుతాం సారూ.. 46 జీవోను రద్దు చేయాండి అంటూ.. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా లో జీవో 46ను రద్దు చేయాలని నిరసనకు దిగారు. జీవో నంబర్ 46 వల్ల.. 4 కమీషనరేట్లకే 53శాతం పోస్ట్ లు భర్తీ చేయడం జరుగుతుందని.. దానివల్ల మిగిలిన జిల్లాల గ్రామీణ అభ్యర్థులు నష్టపోతున్నామని తెలిపారు.

ఈ రోజు(ఆగస్టు 16) హలో TSSP ఛలో TSLPRB నిరసనలు చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా హైదరాబాద్ వ్యాప్తంగా పోలీసులను మోహరించి.. 5 వందల అభ్యర్థులను అరెస్ట్ చేయడం అన్యాయమని వాపోయారు. ప్రభుత్వం వెంటనే వారిని బేశరతుగా విడుదల చేయాలని అభ్యర్థులు కోరారు. ఎన్ని రోజుల నుంచి నిరసనలు చేపడుతున్న ప్రభుత్వం ఈ విషయంపై స్పందించడం లేదని.. కనీసం ఇకనైనా జీవో నం. 46 పై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.