రెండోరోజు కొనసాగుతున్న భూ నిర్వాసితుల నిరసన

రెండోరోజు కొనసాగుతున్న భూ నిర్వాసితుల నిరసన

నల్గొండ జిల్లా: చర్లగూడెం ప్రాజెక్టు భూ నిర్వాసితుల నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కోసం భూములు త్యాగం చేసి రోడ్డునపడ్డ తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మర్రిగూడ తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన నిరసన దీక్షలు ఇవాళ రెండవ రోజు కొనసాగుతున్నాయి. ఈ ధర్నాలో ఖుదబక్ష్ పల్లి, లోయపల్లి, రాంరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన నిర్వాసితులు పాల్గొన్నారు. 

చర్లగూడెం ప్రాజెక్టులో భూములు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అరకొర పరిహారం ఇచ్చి సర్కారు చేతులు దులుపుకుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. చర్లగూడెం, వెంకేపల్లి, నర్సిరెడ్డి గూడెం నిర్వాసితులకు కల్పించిన విధంగానే  తమకు ఆర్ & ఆర్ ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తరతరాలుగా తాము సాగు చేసుకుని జీవిస్తున్న భూమలు ప్రాజెక్టు ఇవ్వడం వల్ల తాము జీవన ఆధారం  కోల్పోయామని..తాము భూములు త్యాగం చేసినందుకు ప్రతిఫలంగా ప్రభుత్వం తమకు ఇస్తానన్న హామీలు నెరవేర్చలేదని అన్నారు. తమకు ఇచ్చిన హఆమీలు నేరవేర్చే వరకు ప్రజాస్వామ్య బద్దంగా నిరసనలు కొనసాగిస్తామని భూ నిర్వాసితులు తేల్చి చెప్పారు.