ప్రపంచ కప్ నుంచి ధావన్ దూరం…

ప్రపంచ కప్ నుంచి ధావన్ దూరం…

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రపంచ కప్ 2019 నుంచి దూరమయ్యాడు. ఇందుకుగాను బీసీసీఐ ప్రకటించింది. ధావన్ తొందరగా రికవరీ కావాలని కోరుకుంది బీసీసీఐ. ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచ్ లో ధావన్ బొటనవేలికి గాయమవగా.. ఇప్పటికీ అది తగ్గలేదని బీసీసీఐ తెలిపింది. డాక్టర్ల సలహా మేరకు ధావన్ కు జులై చివరి వారం వరకు రెస్ట్ అవసరమని చెప్పారు. దీంతో ధావన్ ను వరల్డ్ కప్ నుంచి విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది.

ప్రపంచకప్ 2019  సౌత్ ఆఫ్రికాతో.. భారత్ ఆడిన మొదటి మ్యాచ్ లో ధావన్ అంతగా ఆకట్టుకోనప్పటికి రెండవ మ్యాచ్ ఆస్ట్రేలియాతో మాత్రం సత్తా చాటాడు ధావన్. 109 బంతులు ఆడి 16ఫోర్లతో 117 రన్స్ చేశాడు. అయితే ఆసిస్ బౌలర్ వేసిన ఓ బంతి ధావన్ ఎడమ చేయి బొటన వేలికి తగిలి గాయమైంది. దీంతో అతడు ఫీల్డింగ్ చేయలేదు. ధావన్ గాయపడటంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలో దిగుతున్నాడు.