ప్రభుత్వాసుపత్రిలో కరోనా పేషట్లతో ధింసా డాన్సులు

ప్రభుత్వాసుపత్రిలో కరోనా పేషట్లతో ధింసా డాన్సులు

కరోనా పేషట్లు భయాందోళనకు గురి కాకుండా…వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు డాక్టర్లు కృషి చేస్తున్నారు. ట్రీట్ మెంట్ అందించడంతో పాటు వారు నిరాశ చెందకుండా ఉత్సాహంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో బాగంగా విశాఖ జిల్లా పాడేరు ప్రభుత్వాసుపత్రిలో వినాయకచవితి సందర్భంగా  కరోనా సోకిన పేషట్లు ఎంజాయ్ చేసేలా కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్లు. డాన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు వారితో పాటు కలిసి డాన్సులు చేశారు డాక్టర్లు. వారితో ధింసా డాన్సులతో పాటు… పలు జానపద గీతాలకు నృత్యం చేయించారు. పేషట్లు మనోధైర్యం కోల్పోకుండా ఉండేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయన్నారు డాక్టర్లు. ఆనందంతోనే కరోనాను అధిగమించవచ్చన్నారు. అంతేకాదు..  డాక్టర్లు కూడా వారితో కలిసి డాన్సులు చేశారు.