కాకా మా అమ్మ తరఫు నుంచి బాగా పరిచయమయ్యారు. ఎందుకంటే మా అమ్మ ఈశ్వరీబాయి, కాకా పొలిటికల్ కొలీగ్స్. పొలిటికల్లీ కాకా చాలా పాపులర్ లీడర్. కాకా, ఈశ్వరీ బాయిలది వేరు వేరు పార్టీలయినా, వారిరువురి ప్రజా సమస్యల ఫిలాసఫీ మాత్రం ఒకటే. కాకా ఒక జాతీయస్థాయి నాయకుడు. ఆయనొక నిగర్వి. ఎప్పుడు కలిసినా చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. ప్రేమతో ఒక కూతురితో మాట్లాడినట్లుగానే మాట్లాడేవారు. నన్నొక కూతురిలా చూసేవాడు.
షెడ్యూల్ కులాలను ఒకే తాటిపైకి తెస్తూ యునైటెడ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్అసోసియేషన్కు కృషి చేశాడు. ఉప కులాలుగా విడిపోయి ఉన్న దళితులు నష్టపోకూడదని ఆయన భావించేవారు. కాకా చాలా గొప్ప వ్యక్తి. పేదల పట్ల ఆయనకుండిన కన్సర్న్ అలాంటిది. కాకా, గుడిసెల వెంకటస్వామి లాంటి ముద్దుపేర్లు ఆయనకు పేదల అభ్యున్నతి పట్ల ఉండిన శ్రద్ధకు నిదర్శనం. ఆ కాలంలో నిలువ నీడలేని పేదలకు ఇండ్లను ఏర్పాటు చేయడం చూస్తే ఆయనొక సోషల్రిఫార్మర్ అని చెప్పాలి. ఏడుసార్లు ఆయన ఎంపీగా, మూడుసార్లు కేంద్రమంత్రిగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఆయన పనిచేశారంటే ప్రజల్లో ఆయనకు ఎంత పట్టు ఉందో తెలుస్తుంది.
ఇందిరా, రాజీవ్‌లతో సాన్నిహిత్యం
జాతీయస్థాయిలోనూ ప్రభావిత
నాయకుడాయన. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీలతో సాన్నిహిత్యం బాగా ఉండేది. ఇపుడు కాకా కుమారులు వినోద్, వివేక్ ఆయన లెగసీని గొప్పగా నిలబెట్టారు. కాకా తన రాజకీయ జీవితంలో జాతీయస్థాయిలో నిమ్న వర్గాలకు అనేక విషయాల్లో చాలామేలు చేశారు. కాకాలాగనే మా అమ్మ ఈశ్వరీబాయి కూడా పేదల కన్సర్న్గల నాయకురాలిగా బాగా రాణించారు. కాకా పొలిటికల్ లైఫ్‌కు, మా అమ్మ పొలిటికల్ లైఫ్‌కు పేదల కన్సర్న్ విషయంలో చాలా పొలికలు కనిపిస్తాయి. ఈశ్వరీబాయిని ఎంత గొప్పగా చూశామో, కాకా కూడా అంతే గొప్ప నాయకుడు (టాల్ పర్సనాలిటీ). కాకాను నేనొక ఇన్సిపిరేషన్‌గా చూసేదాన్ని. పీవీ నరసింహారావు నంద్యాల ఉప ఎన్నికలో పోటీ చేసినపుడు ప్రచారానికి కాకా వెంట నేనూ వెళ్లాను. 15 రోజులపాటు వారితో కలిసి ప్రచారం చేయడం ఒక గొప్ప అనుభవం. కాకా వెంట మిమిక్రీ దిగ్గజం నేరేళ్ల వేణుమాధవ్ కూడా ఉన్నారు. కారు ప్రయాణంలో మిమిక్రీ వింటూ కాకా హ్యపీమూడ్ చూశాను. కల్మషం లేని వారి నవ్వులు, హ్యపీ హావభావాలు నాకు బాగా నచ్చాయి. కాకా వెంట అదొక అనుభూతి.
‘తెలంగాణ కాకా’
కాకా మాట్లాడే హైదరాబాదీ భాష అందరినీ ఆకట్టుకునేది. ‘తెలంగాణ కాకా’గా ఆయనకు అదొక గుర్తింపు తెచ్చింది. ఇపుడు ఆయన కుమారుడు వివేక్లోనూ అలాంటి భాషను చూస్తుంటాం. ఆయామ్ వేరీ హ్యాపీ టు సే కాకా ఫ్యామిలీ ఈజ్ గ్రేట్ డూయింగ్ ట్రూ టు కాకా డ్రీమ్స్. కమ్యూనిటీపరంగానే కాదు, మా అమ్మ ఈశ్వరీబాయి, కాకా వెంకటస్వామి ఈక్వల్ ఇన్సిపిరేటివ్ పర్సనాలిటీస్ టు మీ’. కాకాను కులపరంగా చూడను. ప్రతి ఒక్కరికీ సహాయం చేసే వ్యక్తిత్వం ఆయనది. హీ వస్ గ్రేట్ పర్సనాలిటీ. 1969 తెలంగాణ పోరాటంలో సీరియస్‌గా పోరాడిన కీలక వ్యక్తి కాకా. 2013లో తెలంగాణ ఏర్పాటులో ఆయన పాత్ర గొప్పది. కాకా ఆనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్లాను. వారి అంతిమయాత్రలోనూ పాల్గొన్నాను. ఆ అంతిమయాత్రకి రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. వివేక్ చిన్నవాడే అయినా కాకాలాగనే నన్ను గౌరవంగా పలకరిస్తారు, చూస్తారు. మొన్న మా అమ్మ ఈశ్వరీబాయి కార్యక్రమానికి వివేక్ వచ్చారు. చాలా సంతోషం. మొదటి నుంచి వెలుగు పత్రిక మాదే అనుకుంటాం మేము. కాకా యాది మరిచేది కాదు. ఆయన ఇన్స్పిరేషన్ అందరికీ అవసరం. ఆత్మీయత, సౌమ్యం అంటే కాకానే గుర్తొస్తారు. నేనెప్పుడూ వినోద్, వివేక్‌లను నా సొంత సోదరులుగా భావిస్తాను. వారెప్పుడూ నాతో చాలా బాగుంటారు. కాకా లెగసీని కొనసాగిస్తూ.. బీఆర్ అంబేద్కర్ విద్యాసంస్థలను విజయవంతంగా నడుపుతుండడం గొప్ప విషయం. అలాగే, ఇతర సేవాకార్యక్రమాలనూ నడుపుతున్న కాకా ఫ్యామిలీకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. కాకా.. నీ ఇన్సిపిరేషన్ను ఎప్పటికీ మరువలేం.
- జే. గీతారెడ్డి,
మాజీ మంత్రి
