బ్యాంకాక్ : ఇండియా స్టార్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర.. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. శనివారం జరిగిన ఆసియా కాంటినెంటల్ క్వాలిఫికేషన్ టోర్నీలో సిల్వర్ నెగ్గడం ద్వారా మెగా టోర్నీకి క్వాలిఫై అయ్యాడు. ఆర్చరీలో ఇదే తొలి పారిస్ బెర్త్ కావడం విశేషం.
హోరాహోరీగా సాగిన ఫైనల్లో ధీరజ్ 9–10 (షూటాఫ్)తో జిహ్ సియాంగ్ లిన్ (చైనీస్ తైపీ) చేతిలో ఓడి రెండో ప్లేస్‌లో నిలిచాడు. కాంటినెంటల్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన ఇద్దరికి (పురుషుల, మహిళల) ఒలింపిక్ బెర్త్‌ను కేటాయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధీరజ్ క్వార్టర్‌ఫైనల్లో 6–0తో సదేగ్ అష్రాఫీ బావిలి (ఇరాన్)పై, సెమీస్‌లో 6–0తో మహమ్మద్ హుస్సేన్ (ఇరాన్)పై నెగ్గాడు.
తరుణ్‌దీప్ రాయ్ క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టాడు. విమెన్స్ కేటగిరీలో అంకితా భాకట్ కూడా క్వార్టర్స్‌లోనే వెనుదిరిగింది. 4–6తో జియోదఖోన్ అబ్దుసట్టోరోవా (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడింది.
