
వచ్చే రెండేళ్లలో 15 సెంటర్ల ఏర్పాటు
హైదరాబాద్, వెలుగు: ఇండియా లెజెండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ తెలంగాణలో తన ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీని (ఎంఎస్‌డీసీఏ) ఏర్పాటు చేయబోతున్నాడని అతని బ్రాండ్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆర్కా స్పోర్ట్స్ తెలిపింది. ఈ మేరకు బ్రెనియాక్స్ బీ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్లడించింది. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో కనీసం 15 అకాడమీలను ఏర్పాట్లు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు శుక్రవారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో తెలిపింది. ముందుగా హైదరాబాద్, వరంగల్ నగరాల్లో నెలకొల్పుతామని చెప్పింది. ఒప్పందంలో భాగంగా బ్రెనియాక్స్ బీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక (బెంగళూరు మినహా) రాష్ట్రాల్లో 20 నుంచి 25 సెంటర్లను లాంచ్ చేస్తుందని ఆర్కా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ ఎండీ, ఇండియా అండర్–19 వరల్డ్ కప్ టీమ్ మాజీ మెంబర్ మిహిర్ దివాకర్ చెప్పారు. ఇందులో మొదటి అకాడమీ ఈ ఏప్రిల్‌లో బళ్లారిలో స్టార్ట్ చేస్తామన్నారు. ఇండియాలో ఇప్పటికే యాభై ఎంఎస్‌డీసీలు ఉన్నాయన్నారు. ఎంఎస్‌డీసీఏ డైరెక్టర్ ఆఫ్ కోచింగ్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కలినన్ పర్యవేక్షణలో అకాడమీలు నడుస్తున్నాయని చెప్పారు. రూరల్ ఏరియాస్‌లో టాలెంటెడ్ ప్లేయర్లను తీర్చిదిద్దేందుకు బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందివ్వాలన్న లక్ష్యంతో తాము ముందుకెళ్తున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులకు స్కాలర్‌షిప్స్ కూడా అందిస్తున్నామని తెలిపారు.
For More News..