ఓట్ల దొంగ.. దిగిపో.. పీఎం మోదీని ట్యాగ్ చేస్తూ వీడియో షేర్ చేసిన ధృవ్ రాఠీ

ఓట్ల దొంగ.. దిగిపో.. పీఎం మోదీని ట్యాగ్ చేస్తూ వీడియో షేర్ చేసిన ధృవ్ రాఠీ

ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ధృవ్ రాఠీ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఓట్ల తొలగింపుకు బాధ్యతగా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్ తో..  బెంగళూరులోని ఫ్రీడం పార్కు దగ్గర కాక్రోచ్ పార్టీ నిర్వహిస్తున్న ప్రొటెస్టులో పాల్గొన్న ధృవ్ రాఠీ.. ఎక్స్ లో వీడియో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ..  ఓట్ చోర్.. గద్దీ ఛోడ్ (ఓట్ల దొంగ..దిగిపో) అంటూ సాగే నినదాలతో కూడిన వీడియో షేర్ చేశారు.

2026 అక్టోబర్ 8న రాఠీ షేర్ చేసిన వీడియోకు హలో నరేంద్ర మోదీ.. భారత్ మీకు ఒక సందేశం పంపుతోంది.. అనే టెక్స్ట్ జతచేశారు. వీడియోలో రాఠీ స్పీచ్ ఇచ్చిన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఓట్ చోర్..  అని ధృవ్ రాఠీ స్లోగన్స్ ఇస్తుండగా.. గద్దీ ఛోడ్.. అంటూ ప్రతిధ్వనించింది. 

అంతకుముందు సీజేపీ మద్ధతుదారులను ఉద్దేశిస్తూ మాట్లాడిన రాఠీ.. తాను ఇక్కడికి ప్రభుత్వాన్ని మార్చడానికి రాలేదని అన్నారు.  సర్ ప్రక్రియలో ఎన్నికల సంఘం జవాబుదారీ తనం, పారదర్శకత సున్నా  (జీరో ట్రాన్స్ పరెన్సీ, జీరో అకౌంటబులిటీ) అని విమర్శించారు. 

బెంగళూరులోని ఫ్రీడం పార్కులో నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కనుసన్నలలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ నడుచుకుంటున్నారని విమర్శంచారు. సర్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.