పదేళ్ల కుర్రాడు తీసిన ధ్వని షార్ట్ ఫిల్మ్.. ప్రముఖుల ప్రశంసలు

పదేళ్ల కుర్రాడు తీసిన ధ్వని షార్ట్ ఫిల్మ్.. ప్రముఖుల ప్రశంసలు

పదేళ్ల కుర్రాడు లక్షిన్ టాలీవుడ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ను ఆశ్చర్యపరిచాడు. ఎల్.వి ప్రొడక్షన్ బ్యానర్ పై లక్షన్ తీసిన షార్ట్ ఫిల్మ్ ధ్వని.  డెఫ్ అండ్ డంప్ కాన్సెప్ట్ ఈ షార్ట్ ఫిల్మ్.. అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ షార్ట్ ఫిల్మ్ చూసిన చాలా మంది టాలీవుడ్ మేకర్స్ లక్షన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

తాజాగా ధ్వని రిలీజ్ ఈవెంట్ ను జరిపారు మేకర్స్. ఈ ఈవెంట్ కు నిర్మాత బెల్లం కోసం శ్రీనివాస్, దర్శకుడు కరుణ కుమార్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్బంగా బెల్లం కొండా శ్రీనివాస్ మాట్లాడుతూ..   లక్షన్ తీసిన ధ్వని కాన్సెప్ట్‌ బాగుంది. పదేళ్ల కుర్రాడు లక్ష్మిన్‌ ఇంత అద్భుతంగా తీయడం అభినందించదగ్గ విషయం. చాలా మంది కొత్త దర్శకుల కంటే లక్షిన్ బాగా ఈ షార్ట్ ఫిలిం ను తీశాడు అని చెప్పుకొచ్చారు. 

ఇక దర్శకుడు కరుణ కుమార్ మాట్లాడుతూ...ధ్వని షార్ట్ ఫిలిం చాలా బాగుంది. పదేళ్ల అబ్బాయి ఇంత గొప్పగా తీసిన విధానం చాలా బాగుంది. కేవలం పదకొండు నిమిషాల్లో అద్భుతంగా తెరకెక్కించారు అన్నారు. 

ధ్వని షార్ట్ ఫిల్మ్ దర్శకుడు లక్షిన్ మాట్లాడుతూ...ఈ షార్ట్ ఫిలిం మేకింగ్ లో నన్ను ఎంకరేజ్ చేసిన నా పేరెంట్స్ కు కృతజ్ఞతలు. నేను చేసిన ఈ షార్ట్ ఫిలిం కు అందరి దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.  భవిష్యత్తులో దర్శకుడిగా మంచి సినిమాలు చెయ్యాలన్నదే నా కోరిక. నా పేవరేట్ హీరో అల్లు అర్జున్ తో మూవీ చేయాలన్నది నా డ్రీమ్ అని తెలిపారు లక్షిన్.