మెదక్ జిల్లాలో భార్యాభర్త అనుమానాస్పద మృతి... మరో విషాదమేంటంటే.. !

మెదక్ జిల్లాలో భార్యాభర్త అనుమానాస్పద మృతి... మరో విషాదమేంటంటే.. !

మెదక్ జిల్లా టెక్మాల్ మండలం బర్దీపూర్లో భార్యాభర్త అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామానికి చెందిన గంగారం శ్రీశైలం (40),  మంజుల(35) దంపతులకు ఇంటర్ చదివే కొడుకు మహేష్ ఉన్నాడు. కొడుకు షుగర్ వ్యాధితో బాధపడుతుండగా, చికిత్స కోసం చేసిన అప్పులు భారంగా మారడంతో పాటు, భార్యపై అనుమానంతో శ్రీశైలం ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడు. 

ఈ క్రమంలో భార్యపై అనుమానం పెరిగిపోవడంతో శ్రీశైలం మంగళవారం తెల్లవారు జామున భార్య మంజులను హత్య చేసి, ఆ తరువాత తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అసలే షుగర్ వ్యాధితో బాధపడుతున్న మహేష్.. ఇప్పుడు తల్లిదండ్రిని కోల్పోయి అనాధగా మారడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. అండగా నిలబడాల్సిన తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన మహేష్ ఎలా బతుకుతాడోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు.