
డయాబెటిస్ వచ్చిందనీ తెల్వంగనే.. ఫస్ట్ పేవరెట్ ఫుడ్ లిస్ట్‌ల కెళ్లి డిష్ లన్నీ ఒక్కొక్కటి మాయం అయితాయి. అన్నంకు బదులు చపాతీలు తినాలి. ఛాయిలో చక్కెర వేసుకోవద్దు. నాలుకకు తీపి నాకొద్దు వంటి మాటలు జోరుగ వినబడతాయి . ఇది తినొద్దు... అది తినాలె అని కన్ ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని డైట్ టిప్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం. . !
పేషంట్‌కి .. జనరల్ ఐడియల్ డైట్ బ్యాలెన్స్ చెయ్యడమే దీని ఫార్ములా. అంటే ఏది తిన్నా మరీ ఎక్కువ కాకుండా...మరీ తక్కువ కాదన్నమాట. అయితే, మీ మెడికల్ కండిషన్ మీద సందేహం ఉంటే... డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఈ డైట్ అనుసరించాలి.
పొద్దున : సూర్యుడికన్నా ముందు లేవకున్నా... కనీసం సూర్యుడితోనైనా నిద్ర లేవాలె. గ్లాసెడు గోరు వెచ్చని నీళ్లని తాగి రోజును స్టార్ట్ చెయ్యాలి. పరగడుపున గోరు వెచ్చని నీళ్లు తాగితే శరీరంలో ఉండే విషపు పదార్థాలు బయటకు కొట్టుకపోతాయి.
బ్రేక్ ఫాస్ట్... నింపాదిగా కూర్చొని పేపర్ చదువుకుంటూ ఛాయ్ లేకుంటే కాఫీ తాగాలి. తర్వాత నిదానంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. బిజీ డే స్టార్ట్ కావడానికి ముందు ఇదే విధంగానే ప్రశాంతంగా ఉండాలని కోరుకోనివాళ్లు ఎవరుంటారు.. కానీ ఇది సెలవు రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో కుదరని పని కదా..! బిజి షెడ్యూల్ వల్ల చాలామంది బ్రేక్ ఫాస్ట్ చేయకుండనే ఉరుకుతారు. అయితే ఎవరైనసరే బ్రేక్ ఫాస్ట్ కచ్చితంగా చెయ్యాలి. డయాబెటిస్ వాళ్లు బ్రేక్ ఫాస్ట్‌లో వీటిని ట్రై చేయాలి.
- ఒక కప్పు ఛాయ్/కాఫీ/బటర్‌మిల్క్/ పెరుగు తీసుకోవాలి. తరువాత ఒక గిన్నెడు ఓట్స్ జావతో పాటు ఒక దోసకాయ తినాలి.
- ఒక గ్లాసుడు పాలు తాగాలి. దీంతో పాటు ఒక టొమాటో లేదా ఒక కీరదోసకాయ తినాలి.
- గోధుమ అటుకులు పాలల్లో కలుపుకుని టొమాటో తినాలి.
- కూరగాయలు కలిపి వండిన గిన్నెడు ఉప్మాని తినాలి.. తరువాత ఒక కప్పు పెరుగు తినాలి.
- రెండుచపాతీలను బచ్చలి కూర లేదా ముల్లంగి లేదా మెంతికూరతో వండిన గిన్నెడు కర్రీతో రెండు చపాతీలు తినాలి. తర్వాత ఒక కప్పు పెరుగు తినాలి
- గోధుమ బ్రెడ్, ఎగ్ వైట్ ఆమ్లెట్ వేసుకొని తినాలి. ఈ శాండ్ విచ్ మధ్యలో ఎన్ని ఎక్కువ కూరగాయల ముక్కలు ఉంటే అంత మంచిది.
పొద్దున బ్రేక్ ఫాస్ట్, లంచ్‌కి మధ్య ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు చాలామంది. ఇది డయాబెటిస్ పేషెంట్స్ కి మంచిది కాదు. ఈ గ్యాప్ లో ఒక కప్పు గ్రీన్ టీ, వేగించిన వేరుశెనగలు గుప్పెడు తీసుకోవాలి. లేదా ఏదన్నా ఒక పండు ( యాపిల్, పియర్, ఆరంజ్,బొప్పాయి, జామ) మొత్తం తినాలి.
లంచ్ లో ..లంచ్ మంచిగా తినాలి లంచ్ లో ఇవి ఉండేలా చూసుకోవాలి.
- గిన్నెడు సలాడ్, రెండు చపాతీలు... గిన్నెడు పప్పు కూరగాయలతో చేసిన మొలకలు, పెరుగు/బటర్ మిల్క్/ చికెన్/ ఫిష్ తినాలి.
- ఒక పెద్ద గిన్నెడు కూరగాయలు, పప్పుతో చేసిన కిచిడి పెరుగుతో తినాలి..
- గిన్నెడు సలాడ్/ రెండు కీర దోసకాయలు/రెండు టొమాటోలు, సగం గిన్నెడు బ్రౌన్ రైస్/పప్పు+సబ్జి/మొలకలు/పెరుగు/బట్టర్ మిల్క్/ ఫిష్
సాయంత్రం
- సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల మధ్యలో స్నాక్స్ తినాలి. ఏదైనా ఒక పండు యాపిల్/పీర్/
- ఆరెంజ్, బొప్పాయి/జామ) పూర్తిగా తినాలి. పిడికెడు ఉడికించిన లేదా వేయించిన శెనగలు తినాలి.
- ఉప్పు, షుగర్ కలపకుండా గ్లాసెడు బట్టర్ మిల్క్ తాగాలి.
డిన్నర్ తిన్నమంటే తిన్నం అనేలా ఉండాలి. చాలా తక్కువ తినాలి. రాత్రి భోజనంలో కూరగాయలను భాగం చేసుకోవాలి. డిన్నర్ దుంపలు, వేర్లకు సంబంధించిన వాటిని దూరం పెట్టాలి. డిన్నర్ లో వీటిని ట్రై చేయొచ్చు.
- గిన్నెడు సలాడ్ (రెండు కీరదోసకాయలు/రెండు టొమాటోలు- రెండు చపాతీలు సబ్జీ.. పప్పుతో/ మొలకలు/ పెరుగు లైట్ గా చికెన్ లేదా ఫిష్ పెరుగుతో వెజిటబుల్ కిచిడి తినాలి.
- గిన్నెడు సలాడ్/ రెండు కీరదోసకాయలు/రెండు టొమాటోలు- చపాతీ లేదా రొట్టె/
- మొలకలు తినాలి.
బెడ్ టైం: పడుకునే ముందు నట్స్ తింటే బెటర్. రెండు వాల్ నట్స్ లేదా నాలుగు బాదం తిన్న తర్వాత కొన్ని గోరు వెచ్చని నీళ్లు తాగి నిద్రపోవాలి
►ALSO READ | Health: డయాబెటిస్ ఎన్నిరకాలు.. వాటిని ఎలా గుర్తించాలి.. ఎలా వస్తుంది..!