Health: డయాబెటిస్ ఎన్నిరకాలు.. వాటిని ఎలా గుర్తించాలి.. ఎలా వస్తుంది..!

Health:  డయాబెటిస్ ఎన్నిరకాలు.. వాటిని ఎలా గుర్తించాలి.. ఎలా వస్తుంది..!

టైం మనిషిని ఉరుకులు పెట్టిస్తుంది. ఆఫీస్, ఇల్లు.. ఈ రెండింటి మధ్యలో ట్రాఫిక్.. రోజంతా బీజీగా గడుస్తుంది. మనసు నిండా ఒత్తిడి, పైగా.. ఒంటికింత చెమట పట్టే పని కూడా చెప్పడంలేదు. అందుకే నువ్వేం తినొద్దు అని  షుగర్  నోరు కట్టేసింది. అది మాత్రం ఏకంగా శరీరాన్నే తినేస్తుంది..

శరీరంలో ఉపయోగపడకుండా  ..మిగిలిపోయిన చక్కెర సాధారణ స్థితి కంటే ఎక్కువ మోతాదులో రక్తంలో ఉండటాన్ని డయాబెటిస్ అంటారు. డయాబెటిస్ టైప్-1,2,3 అని మూడు రకాలుగా ఉంటుంది. 

టైప్​ 1 ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్... ఇది  ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. శరీరంలోని క్లోమ గ్రంధిలో బీలా సెల్ నుంచి వచ్చే ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయినప్పుడు ఇది వస్తది. ఇన్సులిన్ కలిసినప్పుడే షుగర్ శక్తిగా మారుతది. శక్తిలేని శరీరం ఎట్ల ఉంటదో తెలుసుగా? శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదు కాబట్టి అప్పుడు బయటి నుంచి అందించాల్సి ఉంటుంది.

టైప్ 2 నాన్ ఇస్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ అవసరమైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోవడం వల్ల వచ్చేది టైప్ 2. సాఫ్ట్​వేర్​ లు, ఇంజనీర్లు .. ఊబకాయంతో ఉన్నవాళ్లలో కాల్ సెంటర్లు, మార్కెటింగ్ వంటి రంగాలలో పని చేసే ఉద్యోగుల్లో ఇది ఎక్కువగా కనిపిస్తది. 

టైప్​ 3  జెస్టేషనల్ డయాబెటిస్ గర్భిణులకు వస్తది. డయాబెటిస్ నయం చేసే చికిత్స లేదు. కానీ, మంచి జీవనశైలి, డైట్ తో కంట్రోల్ చెయ్యొచ్చు. అందరిలాగే ఆరోగ్యంగా ఉండొచ్చు.

మారిన జీవనశైలి... తగ్గిన శారీరక శ్రమ, పెరిగిన మానసిక ఒత్తిడి,ఊబకాయం వల్ల డయాబెటిస్ వస్తుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఉంది. అధిక దాహం, మూత్రస్రావం, ఆకలి, బరువు తగ్గిపోవడం, నీరసం, పిక్కల్లో నొప్పి, ఒళ్లు నొప్పులు, గాయాలు నయం కాకపోవడం, ఫంగల్ ఇన్ఫెక్షన్, చర్మవ్యాధులు, కాళ్లు, చేతులకు తిమ్మిర్లు రావడం, సెక్స్ కోరికలు తగ్గిపోవడం వంటివి డయాబెటిస్ లక్షణాలు. పక్షవాతం, గుండెపోటు, బీపీ, గ్యాస్టిక్ వంటి రోగాలకు డయాబెటిస్ దారి తీస్తది. కాబట్టి డయాబెటిస్​ వచ్చిదంటే జీవనశైలిలో.. ఆహార విషయంలో శ్రద్ద తీసుకోవాలని వైద్య నిపుణులు అంటున్నారు. 

►ALSO READ | Home Food : ఇంటి భోజనం ఆరోగ్యమే కాదు.. శ్రద్ధ పెడితే అది ఒక కళ కూడా..