రేవంత్ vs కేటీఆర్.. చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించా

రేవంత్ vs కేటీఆర్.. చట్టపరమైన ప్రక్రియ ప్రారంభించా

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ,మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తోంది. తనపై జరుగుతోన్న దుష్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు కేటీఆర్ .  ఇవాళ కోర్టులో పరువు నష్టం దావా వేశానన్నారు. న్యాయవ్యవస్థలో  నిజానిజాలు రుజువవుతాయని... దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉందన్నారు.

డ్రగ్స్ ఇష్యూపై  వైట్ ఛాలెంజ్ ను స్వీకరించిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి థ్యాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు రేవంత్. దేశంలో పెరుగుతున్న డ్రగ్స్  బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్ ఛాలెంజ్ ను మాజీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి యాక్సెప్ట్ చేశారని… మధ్యాహ్నం 12 గంటలకు అమరవీరుల స్థూపం దగ్గర KTR కోసం వెయిట్ చేస్తామన్నారు.

రేవంత్ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్.. తాను ఏ టెస్ట్ కు అయినా రెడీ అన్నారు. చర్లపల్లి జైళ్లో ఉన్న వ్యక్తితో  టెస్ట్ కోసం వెళ్తే తన గౌరవానికి భంగం కలుగుతుందన్నారు కేటీఆర్. అందుకే రాహుల్ గాంధీ వస్తే తాను ఢిల్లీ ఎయిమ్స్ లో టెస్ట్ చేయించుకోవడానికి సిద్దంగా ఉన్నట్లు ట్వీట్ చేశారు కేటీఆర్. తాను టెస్ట్ చేసుకొని, క్లీన్ చీట్ తెచ్చుకుంటే రేవంత్ క్షమాపణ చెప్పడంతో పాటు పదవి నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. అలాగే ఓటుకు నోటుపై లై డిటెక్టర్ టెస్ట్ కు రేవంత్ రెడీనా అని ట్విట్టర్ వేదికగా ఛాలెంజ్ విసిరారు కేటీఆర్.