రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి

రూ.5 వేల పెన్షన్ ఇవ్వాలని డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: డయాలసిస్ పేషెంట్లకు పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి డయాలసిస్ పేషెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2,016 ఇస్తే సరిపోవని, రూ.5,016కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగైతేనే తమ ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని చెప్పారు. శుక్రవారం నిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ కిడ్నీ పేషెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్ మాట్లాడుతూ, తమకు పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

వారంలో 2, 3 రోజులు డయాలసిస్ కోసమే కేటాయిస్తుండటం వల్ల, తమలో చాలా మంది ఎలాంటి ఆదాయం లేకుండా ఉన్నారని ఆయన తెలిపారు. తిండికి, ఇంటి కిరాయి, పిల్లల చదువులు ప్రతి అవసరం డబ్బుతో ముడిపడి ఉండటం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. దీంతో ప్రభుత్వమే కనికరించి పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రూ.5,106కు పెంచాలని విజ్ఞప్తి చేశారు.