సినీ నటుడు, పద్మభూషణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇవాళ (జూన్ 10) తన 66వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఐదు దశాబ్దాలుగా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన బాలకృష్ణ, మాస్ హీరోగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు X వేదికగా శుభాకాంక్షలు అందించారు. ‘‘పద్మభూషణ్ పురస్కార గ్రహీత, హిందూపురం ఎమ్మెల్యే, నా ఆత్మీయ మిత్రుడు నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ రంగంలో విశిష్ట సేవలందిస్తూ, ప్రజా సేవలోనూ ఆదర్శంగా నిలుస్తున్న మీరు దీర్ఘాయుష్షుతో, సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో విజయాలు సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
#HappyBirthdayNBK
— N Chandrababu Naidu (@ncbn) June 10, 2026
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో… pic.twitter.com/JZV5Fj4iv8
వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలయ్యకు ఇంట్రెస్టింగ్గా విషెస్ తెలిపారు. ‘‘బాలయ్య బాబు గారికి హ్యాపీ బర్త్‌డే. మిమ్మల్ని తెలుసుకోవడం, మీతో కలిసి పనిచేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు చూపించే చిన్నపిల్లలలాంటి ప్రేమ, ఆప్యాయత జీవితంలో ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా అనుభవించాల్సిందే. అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆకలి, ఆసక్తి, ఉత్సాహాన్ని #NBK111 పూర్తిగా తీర్చేస్తుందని ఆశిస్తున్నాను. మనం ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుందాం’’ అని మలినేని ట్వీట్ చేశారు. కాగా ఇవాళ సాయంత్రం బాలయ్య-మలినేని నుంచి వస్తున్న సినిమా నుంచి అప్డేట్ రానుంది.
Happy Birthday Balayya Babu garu ❤️❤️
— Gopichandh Malineni (@megopichand) June 9, 2026
It is a blessing to know you and have the opportunity to work with you. The childlike affection and warmth you shower is something every person should experience at least once in their lifetime ❤️❤️
Hope #NBK111 fills every bit of the… pic.twitter.com/vIpg4oPvf7
బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ బాబీ (కేఎస్ రవీంద్ర) సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘అపారమైన శక్తి, ఉత్సాహం, అంకితభావానికి ప్రతిరూపం బాలయ్య గారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎప్పుడూ ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను. సినిమాపై ఆయనకు ఉన్న అచంచలమైన నిబద్ధతను దగ్గరగా చూసే అదృష్టం నాకు కలిగింది. ఎన్నో మధుర జ్ఞాపకాలు, స్ఫూర్తి, ప్రోత్సాహాన్ని అందించినందుకు ధన్యవాదాలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మరెన్నో బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా 'డాకు మహారాజ్'కు జన్మదిన శుభాకాంక్షలు’’ అని బాబీ తన పోస్టులో పేర్కొన్నారు.
A powerhouse of energy, enthusiasm, and passion.
— Bobby (@dirbobby) June 10, 2026
It has always been a privilege to work alongside Balayya Garu and witness his unwavering commitment to cinema. Thank you for the memories, the inspiration, and the encouragement.
Wishing you good health, happiness, and many more… pic.twitter.com/R8quNsplca
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. "బాలకృష్ణ సర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు తన అపారమైన ఆశీర్వాదాలను మీపై ఎల్లప్పుడూ కురిపించాలని కోరుకుంటున్నాను. మీరు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అంటూ కాజల్ తన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే, ఈ జంట భగవంత్ కేసరితో అలరించింది. ప్రస్తుతం NBK 111లో కాజల్ నటిస్తున్నట్లు టాక్.
Happiest birthday #balakrishna sir ! May god shower you with his choicest blessings! 🎂 💐 pic.twitter.com/Q0bkAWKVIk
— Kajal Aggarwal (@MsKajalAggarwal) June 10, 2026
ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశాడు.‘‘తెలుగు జాతి గర్వకారణం, అభిమానానికి ప్రతిరూపం అయిన మా అమాయక బాబాయ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అభిమానుల హృదయాల్లో మాస్ దేవుడిగా నిలిచిన ఆయన, క్యాన్సర్ బాధితులకు అండగా నిలిచే దాతగా, హిందూపురం ప్రజల అభిమాన నేతగా ప్రత్యేక గుర్తింపు పొందారు. మా బాల మావయ్య నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని లోకేష్ విషెష్ తెలిపారు. అంతేకాకుండా.. దిల్ రాజు, మైత్రి మేకర్స్, గీత ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ ఇలా అనేకమంది బాలకృష్ణకు విషెస్ తెలిపారు.
Wishing our God Of Masses Nandamuri Balakrishna garu, a very Happy Birthday.! #HappyBirthdayNBK pic.twitter.com/Ez9Gjt2VYL
— Sri Venkateswara Creations (@SVC_official) June 10, 2026
